ప్రభుత్వం గతంలో తనకు ఇచ్చిన భూమిని అధికారులు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఓ రైతు హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మూట కొండూరుకు చెందిన బండి నర్సయ్య... 40 ఏళ్ల క్రితం తనకు నాలుగు ఎకరాల 33 కుంటల భూమిని ప్రభుత్వం ఇచ్చిందని కమిషన్కు తెలిపాడు. ఆ భూమిలో నూతనంగా పోలీస్ స్టేషన్ నిర్మించేందుకు యత్నిస్తున్నాడని వాపోయాడు.
భూమి ఇవ్వాలని స్థానిక తహసీల్దారు, ఆర్ఐ, వీఆర్వో తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించాడు. న్యాయం కోసం మూట కొండూర్ పోలీసు స్టేషన్కు వెళ్తే... పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశాడు. తన ఫిర్యాదును పరిశీలించి న్యాయం చేయాలని హెచ్ఆర్సీని కోరాడు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న సచివాలయ భవనాల కూల్చివేత