Theft case in Yadadri Bhuvanagiri: ఓ వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న దంపతులు దొంగిలించాలని అనుకొన్నారు. డబ్బు కోసం గడ్డి తినే రకంలా భార్యతో పన్నాగం పన్ని ఆ వ్యక్తికి వ్యభిచారం ఆశ చూపించాడు. భార్యభర్తలు అనుకొన్నట్టే భార్య ఆ వ్యక్తిని ముళ్లపొదళ్లోకి తీసుకెళ్లింది. వెంటనే ఆమె భర్త వచ్చి ఆ వ్యక్తిపై దాడి చేసి అతని దగ్గర ఉన్న డబ్బులు కొట్టేశారు. మోసపోయానని తెలుసుకున్న వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ దంపతులను పట్టుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
భువనగిరి డివిజన్ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి యాదగిరిగుట్ట వచ్చి బస్సులో తిరుగు ప్రయాణం కోసం బస్టాండ్ చేరుకొని బస్సు ఎక్కాడు. అలకుంట్ల ఎంజర్, అలకుంట్ల శైలజ అనే భార్యాభర్తలు ఆ వ్యక్తి వద్ద ఉన్న నగదును గమనించి డబ్బులు కొట్టేయాలని అనుకొన్నారు. దానికి తగినట్టే సరైన పథకం వేశారు. వ్యక్తికి వ్యభిచారం వల పేరుతో మాయమాటలు చెప్పి అతనికి దగ్గరయింది. మార్గమధ్యంలో సురేంద్రపురి దగ్గర చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి వ్యక్తిపై దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.30 వేలు, మొబైల్‌ను లాక్కొని పారిపోయారు.
బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు నిందితులను రాయిగిరి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. నగదును, మొబైల్ ఫోన్నీ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
"నిన్న రాత్రి యాదగిరి గుట్ట బస్టాండ్ నుంచి వెళ్తున్న వ్యక్తిని ఇద్దరు దంపతులు పరిశీలించారు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకొని అవి దోచుకోవాలని అనుకొన్నారు. వారు అతనితో పాటు బస్సులో ప్రయాణించి దగ్గరయ్యారు. సురేంద్రపురి దగ్గర ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి వారి ఇద్దరు అతని దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ తీసుకొని పారిపోయారు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిని గాలించాం. చివరికి ఈరోజు ఉదయం రాయగిరి వద్ద వెహికల్ చెక్ చేస్తుంటే వారు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకుని విచారించగా ఈ దొంగతనం వారే చేశారని తెలింది. నిందితులు కూడా దీనికి ఒప్పుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించాం."- వెంకట్ రెడ్డి, భువనగిరి డివిజన్ ఏసీపీ
ఇవీ చదవండి: