యాదాద్రి జిల్లాలో సంస్థాన్ నారాయణపురం శివారులో అర్ధరాత్రి నిర్వహించిన రేవ్‌పార్టీ.. కలకలం సృష్టించింది. ఓ రాజకీయ నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లో జరిపిన రేవ్‌పార్టీపై స్థానికులు ఫిర్యాదు చేయగా... పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 90 మందితో పాటు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
పట్టుబడిన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలుండగా... మరి కొంతమంది పరారీలో ఉన్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలా మంది నిషేధిత డ్రగ్స్, మద్యం సేవించినట్లు గుర్తించమని తెలిపారు.
దాడిలో 400 గ్రాముల గంజాయి, 3 ప్యాకెట్ల ఎల్‌ఎస్‌డీ, 120 మద్యం సీసాలతో పాటు 15 కార్లు, 30 ద్విచక్రవాహనాలు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 కెమెరాలు, 76 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని... నిందితులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని మహేశ్ భగవత్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: పిల్లికి పాలుపోయాలంటూ... పక్కాగా ప్లాన్