అకాల వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఈనెల 14, 20 తేదీల్లో కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బీబీనగర్, వలిగొండ, నారాయణపూర్, చౌటుప్పల్, రాజపేట మండలాల్లోని 20 గ్రామాల్లో పంట నష్టం అధికంగా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు.
జిల్లా వ్యాప్తంగా 34 గ్రామాల్లో 5127 ఎకరాల్లోని వరి పంటకు నష్టపోయిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ పేర్కొన్నారు. వరిపంటతో పాటు 63 మంది రైతులకు చెందిన 134 ఎకరాల్లోని ఉద్యానవన పంటలు నష్టపోయాయని హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. వాటిలో ఐదెకరాల్లో కూరగాయల సాగు, 125 ఎకరాల్లో మామిడి తోట, నాలుగెకరాల్లో బొబ్బాయి పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు