రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో పనిచేసే 32 మంది ఉద్యోగులకు కరోనా వచ్చింది. శనివారం 30 మంది ఉద్యోగులకు వైరస్ సోకగా రెండు రోజుల్లో 62 మంది కొవిడ్ బారిన పడ్డారు. 25వ తేదీ నుంచి ఇప్పటివరకు మొత్తం 68 మంది సిబ్బందికి కరోనా వచ్చింది.
ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల స్వామివారి ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపేశారు. కొవిడ్ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: భక్తుల కొంగుబంగారం... వెంకటాపురం లక్ష్మీనరసింహుడు..