ETV Bharat / state

Yadadri Hundi Income: కోటిన్నరకు చేరువలో యాదాద్రి హుండీ ఆదాయం - yadadri 28days income

Yadadri Hundi Income: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల లెక్కింపును నిర్వహించారు. 28 రోజులకు గానూ... కోటి 43 లక్షల 29వేల 820 రూపాయాల నగదు రాగా.. 134 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల 850 గ్రాముల వెండి కానుకలుగా భక్తులు చెల్లించారు.

Yadadri Hundi Income
Yadadri Hundi Income: కోటిన్నరకు చేరువలో యాదాద్రి హుండీ ఆదాయం
author img

By

Published : Dec 29, 2021, 12:05 PM IST

Yadadri Hundi Income: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి హుండీని లెక్కించారు. 28 రోజుల హుండీ ఆదాయంకోటి 43 లక్షల 29వేల 820 రూపాయాల నగదు రాగా.. 134 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల 850 గ్రాముల వెండి ఉన్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతారెడ్డి వెల్లడించారు. లెక్కింపు కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Yadadri Hundi Income
లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

yadadri temple news: మరోవైపు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు విరాళాల సేకరణ కొనసాగుతోంది. భక్తజనుల నుంచి విరాళాల సేకరణకు సెప్టెంబరు 25న దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 2,360 గ్రాముల బంగారం, నగదు రూ.9,63,26,656 భక్తుల ద్వారా సమకూరినట్లు ఈవో గీత తెలిపారు. 45 అడుగుల ఎత్తున్న దివ్య విమానాన్ని స్వర్ణమయం చేసేందుకు 65 కిలోల బంగారం అవసరమని యాడా యంత్రాంగం భావించింది. ఆ మేరకు ముఖ్యమంత్రి గత పర్యటనలో భక్తులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Yadadri Hundi Income
లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

ప్రజాప్రతినిధులు, భక్తులు స్పందించి నేరుగా చెక్కులు, డీడీలు, చలాన్‌, క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా వితరణ చేస్తున్నారు. ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారు కావడంతో ఆ లోపు విమాన గోపురాన్ని స్వర్ణమయం చేసేందుకు యాడా విరాళాల సేకరణను మరింత ముమ్మరం చేయనుంది. కాగా గతంలో పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేట్‌ సంస్థలు ప్రకటించిన విరాళం దేవస్థానానికి ఇంకా అందాల్సిఉంది.

ఇదీ చదవండి: Yadadri Temple: అల వైకుంఠపురానికి.. రహదారి ఇలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.