యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా అద్భుత శిల్పాకళా నైపుణ్యాలతో, యాదాద్రి ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు యాడ యత్నిస్తోంది. తాజాగా మహాబలిపురం నుంచి 20 శిల్పాలు యాదాద్రికి చేరాయి. కృష్ణశిలతో రూపొందించిన 20 కళాఖండాలు ఆలయ ప్రాంగణానికి చేర్చారు. ఆ శిల్పా రూపాలలో ఐరావతాలు, సింహాలు, గరత్మంతుని రూపాలు ఉన్నాయి. వీటిని బిగించేందుకు యాడ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఇవేకాకుండా భక్తితత్వాన్ని పెంపొందించే విధంగా,ఆలయ సన్నిధిలో అష్టలక్ష్మి, అష్టదిక్పాలకులు, నారసింహ రూపాలు, దశావతారాల విగ్రహాలను కూడా పెట్టాలని జీయర్ స్వామి ప్రత్యేక సూచనలు చేశారు. వీటిని ఆలయ సన్నిధిలో పొందుపరిచిన అనంతరం మరింత శోభను సంతరించుకొనుందని ఆలయ స్థపతి ఆనందచారి వేలు తెలిపారు.
ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్