యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు ఘర్షణ చోటు చేసుకుంది. తమపై దాడి చేసిన తెరాస నేతలందరిపై చర్యలు తీసుకోవాలని వలిగొండ మండల కేంద్రంలో ఎస్సీ,ఎస్టీలు ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిచిపోయాయి.
కొంత మంది నాయకుల పేర్లు కేసు నుంచి తప్పించారని ఎస్సీ,ఎస్టీ నేతలు ఆరోపించారు. అనంతరం తెరాస నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్నఎస్సీ,ఎస్టీలకు ఇతర పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. పూర్తి విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇచ్చారు. ఆందోళనకారులు ధర్నా విరమించారు.
ఇవీ చూడండి : షాట్‌గన్ కాంగ్రెస్‌లో... భార్య 'సమాజ్‌వాది'లో