ETV Bharat / state

మాస్కులు లేకుండా తిరిగారు...పోలీసులకు చిక్కారు

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి మాస్క్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్న 13మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

మాస్కులు లేవట...13మందిపై కేసులు
మాస్కులు లేవట...13మందిపై కేసులు
author img

By

Published : Apr 12, 2020, 8:22 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలో మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాదేశాలు బేఖాతరు చేసినందుకు ఐపీసీ 188, మాస్క్ ధరించని కారణంగా ఐపీసీ 269 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

13 మందిపై కేసు...

మాస్కులు పెట్టుకోకుంటే రెండు సెక్షన్​ల మీద కేసులు నమోదు చేస్తున్నామని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇవాళ 13 కేసులు నమోదు చేశామని... వీరంతా కోర్టులో 500 నుంచి 1000 రూపాయల వరకు అపరాధ రుసుం కట్టుకోవాల్సి ఉంటుందని సీఐ వెల్లడించారు. ప్రజలంతా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. అకారణంగా రోడ్డెక్కితే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి : కామారెడ్డి జిల్లాలో మరో 2 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.