Lady Pilots Training in Warangal: అది వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టు. సువిశాలమైన ఈ ప్రాంతంలో ఎన్‌సీసీ విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. సీనియర్ డివిజన్‌లో 125 మంది, జూనియర్ డివిజన్‌లో 225 మంది యువతీ యువకులు మైక్రో లైట్ విమానంలో పయనిస్తూ శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో 100 మందికి పైగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువతులు నేటి తరం అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక పక్కా చదువుల్లో రాణిస్తూనే.. విమానయానంలో శిక్షణ తీసుకుంటున్నారు.
వీరికి ఎయిర్‌ఫోర్స్, ఎన్‌సీసీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ధైర్య సాహసాలతో కూడిన ఈ మైక్రోలైట్ విమానయాణంలో చురుగ్గా పాల్గొంటూ గగనతలంలో విహరిస్తున్నారు. కుటుంబ నేపథ్యం ఏదైన నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనన్నా ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటే భవిష్యత్తులో అనేక అవకాశాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ మామునూరు ఎయిర్‌పోర్టు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ లోపంతో ఎయిర్‌పోర్టు పరిసరాలు, రన్‌వే పై పిచ్చి మొక్కలు పేరుకుపోతున్నాయని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మామునూరు ఎయిర్‌పోర్టులో మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. విద్యార్థులు కేవలం సంప్రదాయ కోర్సులే కాకుండా ఇలాంటి విభిన్నమైన వృత్తుల్లో కూడా రాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్ఓసీలో చేరి విమానయానంలో శిక్షణ తీసుకుంటే భవిష్యత్తులో సాయుధ దళాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు.
"ఎన్సీసీలో చేరితే మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఈ మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో ఎన్‌సీసీ ట్రైనింగ్‌నే కాకుండా ఇంకా ప్లయింగ్ టెక్నిక్‌లు కూడా నేర్పుతారు. ఇక్కడ మేము ప్లయింగ్ చేయడానికి మైక్రోలైట్ అనేది ఉంది. ఫ్లయింగ్ కెప్టెన్ దీనికి సంబంధించిన శిక్షణ ఇస్తున్నారు. ఈ ఎన్సీసీలో ఉండడం వల్ల త్రివిధదళాల్లో వేగంగా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ మేము మా శిక్షణను మంచిగా పూర్తి చేస్తున్నాము." - ఎన్‌సీసీ విద్యార్థినులు
"ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ అనేది చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల అందరూ ఆర్మీ వైపు వెళుతూ ఉన్నారు. ఎసీసీ విద్యార్థులు ఎయిర్ వింగ్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆర్మిడ్ ఫోర్సుల్లో చేరవచ్చు. ఈ విభాగంలో సీ సర్టిఫికేట్ సాధిస్తే వారికి స్పెషల్ ఎంట్రీ అనేది ఉండి.. డైరెక్టు జాయిన్ అవ్వవచ్చు. మామునూరు ఎయిర్‌పోర్టులో రన్‌వే సరిగ్గా లేదు, ఎయిర్పోర్ట్ బయట వర్షం పడితే.. మొత్తం వర్షం నీటితో మునిగిపోతుంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము." - డా. ప్రసాద్, ఫ్లయింగ్ ఎన్‌సీసీ అధికారి
ఇవీ చదవండి: