గేదెలకు నీళ్లు తాగించటానికి చెరువులోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మహేష్ అనే 14 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండ పెద్ద చెరువులో చోటు ఈ ఘటన చేసుకుంది. గేదెలు మేపడానికి చెరువు ప్రాంతంలోకి వెళ్లిన బాలుడు వాటిపై ఎక్కి నీటిలోకి వెళ్లాడని తోటి బాలుడు తెలిపాడు. నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత అకస్మాత్తుగా గేదెపై నుంచి బాలుడు జారీ నీటిలో పడటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తోటి బాలుడు ఇచ్చిన సమాచారంతో గ్రామస్థులు చెరువు నీటిలో వెతకగా మహేష్ మృతదేహం లభించింది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటం వల్ల బాలుడి తల్లిదండ్రులు గుండెలువిలపించేలా రోదించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: యువకుడి ప్రాణం తీసిన కుటుంబ కలహాలు