ETV Bharat / state

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు - మహిళలు నిరసన

వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట్ మండలంలో తాగునీటి కోసం మహిళలు నిరసనకు దిగారు. తమకు  వెంటనే తాగు నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

తాగునీటి కోసం నిరసన చేసిన మహిళలు
author img

By

Published : Jul 20, 2019, 12:09 AM IST

తాగునీటి కోసం రోడ్డుపై బిందెలను అడ్డుపెట్టి మహిళలు నిరసన వ్యక్తం చేసిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రధాన రహదారిపైకి మహిళలందరూ చేరుకొని రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కాలనీల్లోకి మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని పది రోజులకు ఒకసారి కూడా నల్లాల ద్వారా నీరు అందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పుడో ఒకసారి వచ్చే ట్యాంకర్ నీరు కనీస అవసరాలకు సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవట్లేదని వాపోయారు. సమాచారం అందుకున్న మడికొండ సీఐ, పుర ఏఈ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని అధికారులు హమీ ఇవ్వడం వల్ల మహిళలు ఆందోళన విరమించారు.

తాగునీటి కోసం నిరసన చేసిన మహిళలు

ఇవీ చూడండి : బాలాపూర్​లో సోదాలు.. 54 మంది బాలకార్మికుల గుర్తింపు

Intro:hyd_tg_22_19_rtc_karmika_yatra_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ని అలాగే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన చైతన్య యాత్ర సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చేరుకుంది
పటాన్చెరు ప్రయాణ ప్రాంగణం లో డ్రైవర్, కండక్టర్లకు కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా ఆర్టీసీని విలీనం చేయాలని గతంలో కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికే నాలుగు జిల్లాల్లో పూర్తిచేసుకుని యాత్ర భెల్ డిపోలో పటాన్చెరు నుంచి ప్రారంభించామని చెప్పారు రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు విలీనం కోసం ఎదురుచూస్తున్నారని దీంతో వారి భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు ప్రముఖ పాత్ర వహించారని అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా భాగస్వామ్యం అయ్యారని తెలిపారు ఆర్టీసీ కార్మికులు ఈ పోరాటం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు

Conclusion:బైట్ : హనుమంతు జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.