ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. స్థానిక కరీమాబాద్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న విజయలక్ష్మి.. ఉన్నతాధికారి అరుణ్ వేధింపులు తాళలేక మందు గోలీలను వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
అపస్మారక స్థితిలో ఉన్న విజయలక్ష్మిని తోటి సిబ్బంది గుర్తించి హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తోటి ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్న మెడికల్ ఆఫీసర్ అరుణ్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు.
ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతాలు ఆపాలని కోరిన తెలంగాణ సర్కారు