ETV Bharat / state

Angry on Parakala MLA: డబుల్​బెడ్​రూం ఇళ్ల ప్రారంభోత్సవానికొచ్చిన ఎమ్మెల్యే.. నిలదీసిన మహిళలు.. ఎందుకో తెలుసా..

పరకాల నియోజకవర్గంలోని వెల్లంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. 36 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. నచ్చిన వారికి ఇళ్లు కేటాయించారని.. తమకెందుకు ఇవ్వరని మహిళలు నిలదీశారు.

డబుల్​బెడ్​రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో రసాభాస.. ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

author img

By

Published : Oct 21, 2021, 5:35 PM IST

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని వెల్లంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్​ బెడ్​రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. 36 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాగా.. మహిళలు అడ్డుకున్నారు. అధికార పార్టీకి నచ్చిన వారికి మాత్రమే ఇళ్లు కేటాయించారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

తమకెందుకు ఇవ్వరని ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. ఎమ్మెల్యేతో మహిళలు వాగ్వాదానికి దిగారు. అందరికి డబుల్‌ బెడ్​రూం ఇస్తామని చెప్పారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రానివారి వివరాలు తీసుకుని డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీతో మహిళలు శాంతించారు.

అనంతరం చల్లా ధర్మారెడ్డి డబుల్​బెడ్​రూం గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసి సామూహిక గృహప్రవేశాలు చేయించారు.

డబుల్​బెడ్​రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో రసాభాస.. ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు

ఇదీ చదవండి: Family wear helmets at home: ఆ ఇంటి పెరట్లోకి వెళ్లాలంటే హెల్మెట్ తప్పనిసరి.. ఎందుకో తెలుసా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.