ETV Bharat / state

ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన యువతి

author img

By

Published : Dec 26, 2020, 5:17 PM IST

తనను పెళ్లి చేసుకోవాలని ఓ ఆర్మీ జవాన్ ఇంటి ముందు బాధిత యువతి దీక్షకు దిగిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాలుగా వాడుకుని.. పెళ్లి అనే సరికి ముఖం చాటేశాడని వాపోయింది. తనకు న్యాయం జరిగేంత వరకూ దీక్ష విరమించేది లేదని తెలిపింది.

woman protest at warangal urban district,demanding to get married with army person
ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన యువతి

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ రమేశ్​ యాదవ్ ఇంటి ముందు వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సంకినేని సునంద అనే యువతి బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టింది. ఐదేళ్లుగా తనను రమేశ్​ శారీరకంగా, మానసికంగా ఉపయోగించుకుని పెళ్లికి నిరాకరించాడని తెలిపింది. ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం అయ్యాడని.. అందుకే అతని ఇంటి ముందు బైఠాయించానని ఆ యువతి పేర్కొంది.

రాంగ్ కాల్​తో పరిచయం ఏర్పడిన తనను ఐదు సంవత్సరాలుగా వాడుకున్నాడని సునంద చెప్పింది. పెళ్లి చేసుకోమని అడగడంతో ఆరు నెలల నుంచి సరిగా మాట్లాడటం లేదని తెలిపింది. తనను పెళ్లి చేసుకోవాలని.. అప్పటి వరకు రమేశ్​ ఇంటి ముందు నుంచి కదిలేదే లేదని బాధిత యువతి పేర్కొంది. కాజీపేట ఏసీపీ రవీందర్, స్థానిక సీఐ, ఎస్సై.. యువతికి, యువకుడి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్​ నిర్వహించారు.

ఇదీ చూడండి: లక్నవరం జలాశయంలో గల్లంతైన​ ఉద్యోగి మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.