పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై మార్కెట్ కమిటీ ఛైర్మన్, వ్యవసాయ, పోలీస్, జిన్నింగ్ మిల్లుల జిల్లా అసోసియేషన్తో పాటు పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
జిల్లాలో 82 వేల ఎకరాలకు పైగా రైతులు పత్తి పంట సాగు చేశారని.. సుమారు 90 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు. ఈ సంవత్సరం 28 జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్లుల నిబంధనల మేరకు కావల్సిన అవసరమైన యంత్రాలు వసతులు సర్వే చేసి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీసీఐ అధికారులను కోరారు.
ఇదీ చూడండి: తెరాస కార్పొరేటర్లలో ఆ 15 శాతం మంది ఎవరో అనే గుబులు!