ETV Bharat / state

'నేను కేసీఆర్ సైనికుడిని.. నన్ను గెలిపించండి'

వరంగల్ అర్బన్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్​తో కలిసి ఓట్లు అభ్యర్థించారు.

warangal-urban-district-teresa-candidate-palla-rajeshwar-reddy-along-with-government-chief-whip-dassam-vinay-bhaskar-requested-for-votes
'కేసీఆర్ సైనికుడిని.. నన్ను గెలిపించండి'
author img

By

Published : Mar 7, 2021, 11:33 AM IST

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పనలను గుర్తించి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెరాస పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్​తో కలిసి వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ వడ్డేపల్లి చెరువు కట్టపైన వాకర్స్​ని కలిసి ప్రచారం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 50వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని పల్లా తెలిపారు. ఐటీ, ప్రైవేట్ సెక్టార్​లోనూ ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేస్తామని వివరించారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పీఆర్సీ.. ఉద్యోగుల హక్కు అని త్వరలోనే అది వచ్చి తీరుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి... కేసీఆర్ సైనికుడిగా ముందుకు వస్తున్న తనను గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి: హోంవర్క్ అడిగినందుకు టీచర్​పై కాల్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.