ETV Bharat / state

ప్రభుత్వ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్​

వరంగల్​ పట్టణ జిల్లా దేవునూర్​, ముప్పారం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్​ పరిశీలించారు. ఫుడ్​ ప్రాసెస్​ యూనిట్ల నిర్మాణం కోసం గతంలో 40 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూమి చుట్టుపక్కల గల రైతులతో మాట్లాడి మరిన్ని భూములు సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్​ ఆదేశించారు.

warangal urban district collector inspects government lands
ప్రభుత్వ భూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్​
author img

By

Published : May 17, 2020, 7:31 PM IST

వరంగల్ పట్టణ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూర్, ముప్పారం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఫుడ్ ప్రాసెస్ యూనిట్ల నిర్మాణానికి సుమారు 200 ఎకరాల భూమి కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినందున... ఆ భూములు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని పరిశీలించినట్లు సమాచారం.

ఈ ప్రాంతంలో గతంలో సేకరించిన 40 ఎకరాల భూమితో పాటుగా దాని చుట్టుపక్కల గల రైతులతో సంప్రదింపులు జరిపి భూములు సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదనపు జిల్లా కలెక్టర్ దయానంద్, ఆర్​డీవో వెంకారెడ్డి, తహసీల్దార్​ తదితరులు ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్​కు వివరించారు.

ఇవీ చూడండి: 'ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి అక్కడే పరీక్షలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.