వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిపై పాలనాధికారి రాజీవ్ గాంధీ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారి వివరాలను ప్రైవేట్ ఆసుపత్రులకు తెలియజేసేందుకు ఒక సీనియర్ వైద్యుడిని నోడల్ అధికారిగా నియమించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు రోగ నిరోధక శక్తి పెంపొందించే చర్యలపై తరచుగా అవగాహన కల్పించాలని కోరారు. హోంకార్వంటైన్లో ఉన్న వ్యక్తిని పారమెడికల్ సిబ్బంది రోజుకు రెండు సార్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.