Warangal Super Specialty Hospital : తెలంగాణ వైద్యరంగానికే తలమానికంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో, అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తూ పనుల్లో నిమగ్నమయ్యారు. వరంగల్‌లో బహుళ అంతస్తుల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.
Warangal Super Specialty Hospital Works : నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యసేవలు అందించాలన్న సంకల్పంతో రూ.1200 కోట్ల ఖర్చుతో 56 ఎకరాల్లో రెండున్నర వేల పడకల ఆసుపత్రి నిర్మాణానికి సర్కార్ శ్రీకారం చుట్టింది. భవనాల నిర్మాణ పనులు డెబ్బై శాతానికి పైగా పూర్తయ్యాయి. మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నారు. కాగా దసరా నాటికి ఆసుపత్రి నిర్మాణం పనులు చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను, నిర్మాణ ఏజేన్సీలను కోరారు.
మొదటి దశలోనే సేవలు ప్రారంభం : వరంగల్ కేంద్ర కారాగారం స్ధలంలో 24 అంతస్థులతో ఈ అత్యాధునిక ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 9 అంతస్తుల స్లాబు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను మూణ్నెళ్లలో పూర్తి చేయనున్నారు. సెప్టెంబర్ కల్లా ఆసుపత్రి మొదటి దశ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో పనులను చకచకా చేసేస్తున్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్ని లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సూపర్ స్పెషాలటీ ఆసుపత్రి నిర్మించాడానికి నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అధునాతన వైద్యం కోసం హైదరాబాద్ రాకుండా వరంగల్లోనే చికిత్స పొందవచ్చు. ఈ ఆసుపత్రి నిర్మాణం వల్ల చుట్టు పక్కల పల్లే వాసులకు, జిల్లా వాసులకు ఎంతో ఉపయోగపడనుంది.
ప్రైవేటు ఆసుపత్రి మాదిరి : అన్ని విభాగాల్లో అధునాతన వైద్యసేవలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ప్రధానంగా అవయమార్పిడి.. గుండె శస్ర్తచికిత్సల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. క్యాన్సర్ చికిత్సకు కీమోథెరఫీ, రేడియేషన్ థెరఫీకి వార్డు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మల్టీసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేంద్రంగా 215 ఎకరాల్లో హెల్త్ సిటీ రూపుదిద్దుకుంటుంది. వరంగల్ తోపాటు పరిసర జిల్లాల ప్రజలకూ ఈ ఆసుపత్రి ఓ వరమే. వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే అవసరం ఉండదు. ఫలితంగా వ్యయ ప్రయాసలు తగ్గి పేదలకు అందుబాటులో ఉచిత వైద్యం అందనుంది.
ఇవీ చదవండి: