హన్మకొండలోని తేజస్వీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పార్థివ్ ఈ నెల 7వ తేదీన చంద్రయాన్-2 వీక్షించేందుకు ఇస్రో బెంగళూర్ నుంచి ఆగస్టు 30న ఆహ్వానం అందుకున్నాడు. తెలంగాణ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా అందులో పార్థివ్ ఒకరు. తమ పాఠశాల నుంచి ఎంపిక కావటం ఎంతో గర్వకారణమని పార్థివ్ను యాజమాన్యం అభినందించింది. అతనితో పాటుగా తల్లికి కూడా చంద్రయాన్-2 చూసే అవకాశం దక్కింది.
ఇవీచూడండి: మోదీ ధ్యానమా మజాకా! గుహ కథే మారిపోయింది!