ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ గర్భిణికి ఓరుగల్లు పోలీసుల సాయం - తెలంగాణ తాజా వార్తలు

లాక్​డౌన్​ వేళ మండుటెండలో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న గర్భిణిని రైల్వేస్టేషన్​కు చేర్చి తమ వంతు మానవత్వాన్ని చాటుకున్నారు వరంగల్​ పోలీసులు. అసలు ఏం జరిగిందంటే..?

Warangal police help to pregnant lady
Warangal police help to pregnant lady
author img

By

Published : May 17, 2021, 3:23 PM IST

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో నివాసం ఉంటున్న వెంగళ అఖిల గర్భవతి కావడంతో తన భర్త రమేశ్​తో కలిసి హన్మకొండలోని అమ్మగారి ఇంటికి వచ్చింది. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకుంది. తిరిగి సికింద్రాబాద్​కు వెళ్లేందుకు భార్యభర్తలు సిద్ధమయ్యారు.

లాక్​డౌన్​ కావడంతో.. కాజీపేట రైల్వేస్టేషన్​కు వెళ్లేందుకు ఎలాంటి వాహనం అందుబాటులో లేదు. దీనితో మండుటెండలో కాలినడకన పయనమయ్యారు. జిల్లా పరిషత్​ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సుబేదారి ఇన్​​స్పెక్టర్​ రాఘవేందర్​.. కాలినడకన వెళ్తున్న అఖిలను గమనించి... విషయం తెలుసుకున్నారు. తక్షణమే అఖిలను, ఆమె భర్తను పోలీస్​ వాహనంలో కాజీపేట రైల్వేస్టేషన్​లో దింపారు. దంపతులు ఇద్దరు పోలీసులు అందించిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.