వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ విద్యార్థులు ప్రధానమంత్రి సహాయ నిధికి 23లక్షల 76వేల 840రూపాయల విరాళాలు అందిస్తున్నట్లు ప్రకటించారు. కొవిడ్-19పై పోరాటానికి తమవంతు మద్దతుగా 4000 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా... వారి ఒక వారం మెస్ ఛార్జీలను అందజేస్తున్నట్లు నిట్ యాజమాన్యం పేర్కొన్నారు.
గతనెలలో సుమారు 20 లక్షల రూపాయలతో పాటు... పూర్వ విద్యార్థులు 6 లక్షలకు పైగా విరాళాలను అందించారు. తాజాగా విద్యార్థులు ఇవ్వనున్న విరాళాలతో వరంగల్ నిట్ నుంచి ప్రధానిమంత్రి సహాయ నిధికి ప్రకటించిన విరాళాలు మొత్తం 50 లక్షల రూపాయలకు చేరుకున్నాయి. విరాళాలు అందించిన ప్రతీ ఒక్కరిని నిట్ సంచాలకుడు ఎన్వీ రమణా రావు అభినందించారు.
ఇవీ చూడండి: ఆసుపత్రికి వెళ్లాలంటే.. డోలీ ఎక్కాల్సిందే!