గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ బ్రోచర్‌ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావుతో కలిసి విడుదల చేశారు. 2015 నాటి ఎల్‌ఆర్‌ఎస్ స్లాబ్‌లతో క్రమబద్ధీకరణ రుసుంను వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించినట్లు వరంగల్ మేయర్ ప్రకాశ్‌రావు తెలిపారు.
జీఓ 131 ఆధారంగా..
అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు సర్కార్ జారీచేసిన ఎల్‌ఆర్‌ఎస్ జీఓ నెంబర్ 131 ఆధారంగా అల్పాదాయ వర్గాలపై ఆర్థిక భారం మోపమని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ నాటి మార్కెట్ విలువ ఆధారంగానే జీఓను ప్రభుత్వం సవరించనున్నట్లు ప్రకటించారు.
అలా ఉంటే 100 శాతం ఛార్జీలు..
చదరపు గజం మార్కెట్ ధర రూ. 3 వేల వరకు ఉంటే 20 శాతం , రూ.3,001 నుంచి రూ. 5 వేల వరకు 30 శాతం ,రూ. 5001 నుంచి రూ. 10 వేల వరకు 40 శాతం, రూ. 10,001 నుంచి రూ. 20 వేల వరకు 50 శాతం, రూ. 20,001 నుంచి రూ. 30 వేల వరకు 60 శాతం, రూ. 30,001 నుంచి రూ. 50 వేల వరకు 80 శాతం, రూ. 50 వేలకు పైగా మార్కెట్ ధర ఉంటే వందశాతం చార్జీలను వసూలు చేస్తామని తెలిపారు.