కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వరంగల్ మహా నగర పాలక సంస్థ నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నగరపాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్లలో ఇంటికి రెండు మాస్క్‌ల చొప్పున అందించాలని నగర మేయర్ గుండా ప్రకాష్ అధికారులకు సూచించారు.
వివిధ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల సమన్వయంతో మాస్కులను పంపిణీ చేయాలని కమిషనర్‌కు సూచించారు. ముందుగా విలీన గ్రామాలలో, మురికివాడలలో మాస్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో, రహదారులపై ఉమ్మి వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు.
ఇవీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు