ETV Bharat / state

క్షేమంగా తిరిగొచ్చారు! - వరంగల్​లో కరోనా కేసులు సున్నా

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో కరోనా బారిన పడ్డవారంతా కోలుకొని ఇళ్లకు వచ్చేశారు. ఎంజీఎం ఆసుపత్రికి బాధితులు రాకపోవడంతో మహమ్మారి అదుపులో ఉన్నట్టే స్పష్టమవుతోంది. ఇప్పుడు అధికారులు ఎక్కువగా దృష్టి సారించాల్సింది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు, ఇతరుల పైనే. వీరిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే హైదరాబాద్‌కు తరలించి మైగ్రెంట్స్‌ కేసులుగా చూపుతున్నారు.

corona free warangal district
క్షేమంగా తిరిగొచ్చారు!
author img

By

Published : May 16, 2020, 9:06 AM IST

వరంగల్‌ అర్బన్‌లో 27 కేసులు నమోదవ్వగా, భూపాలపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి వైరస్‌ సోకింది. జనగామ జిల్లాలో ముగ్గురు, ములుగులో ఇద్దరు, మహబూబాబాద్‌లో ఒకరికి నిర్ధారణ అయింది. అందరినీ హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించారు. అనంతరం ప్రాథమిక కాంటాక్ట్‌లను గుర్తించి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు పంపారు.

మర్కజ్‌ కేసులు, ఇతరత్రా కలిపి 36 కేసులు ఉమ్మడి పరిధిలో నమోదవ్వగా ఇప్పుడంతా కోలుకుని ఇళ్లకు వచ్చేశారు. మరో వైపు ఎంజీఎం ఆసుపత్రిలోనూ ప్రత్యేక కొవిడ్‌ ఓపీ వార్డు ఏర్పాటు చేసి అనుమానితులకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ వస్తున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటెయిన్‌మెంటు జోన్లుగా విభజించి కరోనా నివారణకు పూర్తి స్థాయిలో కట్టడి చర్యలు తీసుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో అసలు కేసులు నమోదు కాలేదు.

ఇప్పుడు వారి ద్వారా..

ప్రస్తుతం అధికారుల ముందున్న సవాల్‌ పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌ చేసి కరోనా సామాజిక వ్యాప్తి కాకుండా చూడడమే. ఓరుగల్లు నుంచి ఇతర ప్రాంతాలకు వలస, ఇతర కారణాలతో వెళ్లిన వారు పెద్ద సంఖ్యలో ఇప్పుడు స్వస్థలాలకు వస్తున్నారు. ఒక్క వరంగల్‌ అర్బన్‌కే వివిధ రాష్ట్రాల నుంచి 518 మందికిపైగా వచ్చారు.

తొలుత వరంగల్‌ నగరానికి రైళ్లు, బస్సుల్లో వస్తూ వారి సొంతూళ్లకు వెళ్తున్నారు. వైద్య పరీక్షలు చేసి హోం క్వారంటైన్‌ ముద్ర వేశాక ఇళ్లకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఇటీవలే అక్కడి నుంచి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపారు.

పొరుగు రాష్ట్రాల నుంచి రైళ్లలో లేదా ప్రభుత్వ అధీనంలో వచ్చిన వారి వివరాలు రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల వద్ద ఉంటాయి. కొందరు వలస కూలీలు నేరుగా నడుచుకుంటూ, సొంత వాహనాల్లో వస్తున్నారు. వారిని గుర్తించడం ఎంతో కీలకం. జిల్లాకు రాగానే ఎవరినీ కలవకుండా వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్‌లో ఉండేలా చూడాలి. లక్షణాలు ఉంటే ఎంజీఎం కొవిడ్‌ వార్డుకు తరలించి పరీక్షలు చేయాలి.

అప్రమత్తంగా ఉన్నాం

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉన్నాం. ఆరు వైద్య బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు, రైళ్లలో వస్తున్నారు. వారిని క్షుణ్నంగా పరీక్షించాకే స్వస్థలాలకు పంపుతున్నాం. వరంగల్‌ బీటు బజార్లో హమాలీలు, లారీ డ్రైవర్లకు మే 4 నుంచి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ అందుబాటులో ఉంచాం. ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సమాచారం ఇవ్వకపోతే హోంక్వారంటైన్‌ చేస్తాం.

- డాక్టర్‌ లలితాదేవి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.