ETV Bharat / state

కరోనా నుంచి కోలుకుంటున్న ఉమ్మడి వరంగల్​ జిల్లా

ఉమ్మడి వరంగల్​ జిల్లా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి జిల్లాలో మెుత్తం 36 కేసులు నమోదు కాగా... అందులో 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో ముగ్గురు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కూడా త్వరలో డిశ్చార్జ్​ అయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

warangal corona positive patients discharge from hospitals
కరోనా నుంచి కోలుకుంటున్న ఉమ్మడి వరంగల్​ జిల్లా
author img

By

Published : May 6, 2020, 10:58 PM IST

కరోనా కేసులు లేని జిల్లా వైపు ఉమ్మడి వరంగల్ వేగంగా అడుగులు వేస్తోంది. రెడ్​జోన్ పరిధిలో ఉన్న వరంగల్ అర్బన్ జిల్లాలో ఓ వ్యక్తి ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం జిల్లాకు చెందిన 27 మందిలో గాంధీ ఆసుపత్రి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 26కు చేరింది. మరొకరు మాత్రమే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పదకొండు రోజులనుంచి కొత్తగా ఎలాంటి కేసు నమోదుకాకపోవడం విశేషం.

జనగామ జిల్లాకు చెందిన ముగ్గురిలో ఇద్దరు డిశ్చార్జ్ కాగా.. ఒకరు గాంధీలో చికిత్స పొందుతున్నారు. భూపాలపల్లికి చెందిన ముగ్గురిలోనూ...ఇద్దరు ఇప్పటికే డిశ్చార్జ్ కాగా... మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మొత్తం 36 మందిలో...33 మంది డిశ్చార్జ్ కాగా.... ప్రస్తుతం ముగ్గురు మాత్రమే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు కూడా త్వరగా కోలుకుని... డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 11 మందికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.