ETV Bharat / state

Warangal BRS MLA Tickets 2023 : ఓరుగల్లులో దాదాపు సిట్టింగులకే టికెట్లు.. అభ్యర్థుల సంబురాలు.. కార్యకర్తల కోలాహం - స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ సమస్య

Warangal BRS MLA Tickets 2023 : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్ లభించడంతో అందరిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జనగామ నియోజకవర్గాన్ని పెండింగ్‌లో పెట్టగా స్టేషన్ ఘన్‌పూర్‌లో అంతా అనుకున్నట్లుగానే ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అభ్యర్థిత్వం ఖరారైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్వయం కృతాపరాధమే టిక్కెట్ రాకపోవడానికి కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. పలుచోట్ల గులాబీ శ్రేణులు తమ నాయకుల పేర్ల ప్రకటనపై ఆనందోత్సవాలు జరుపుకున్నారు.

Telangana Political News
Station Ghanpur Viral Political Issue
author img

By

Published : Aug 22, 2023, 2:45 PM IST

Warangal Sitting MLAs Get Tickets Again in BRS టిక్కెట్ ఖరారులో అధిష్ఠానం ఆచితూచి అడుగులు.. ఓరుగల్లులో అత్యధికంగా సిట్టింగ్​లకే ప్రాధాన్యం

Warangal BRS MLA Tickets 2023 : సార్వత్రిక ఎన్నికలకు అందరికంటే ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటించి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించగా.. అక్టోబర్ 16న ఓరుగల్లులో సింహగర్జన సభలో మేనిఫెస్టో ప్రకటించనుంది. మేనిఫెస్టో ప్రకటించే సభ కావడంతో.. ఆ సభను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని.. అధిష్ఠానం జిల్లా నేతలను ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా(MLA Candidates List) గులాబీ శ్రేణులను ఆనందానికి గురి చేసింది.

Warangal BRS MLA Candidates 2023 : టిక్కెట్ నిరాకరిస్తారని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లతో ప్రచారం జరిగినా.. ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ మినహా ఎక్కడా మార్పు జరగలేదు. జనగామ టికెట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికేనని జరిగిన ప్రచారం.. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని నైరాశ్యన్యానికి గురి చేసింది. అంతేగాక నియోజకవర్గ వ్యాప్తంగా ముత్తిరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టడంతో అభ్యర్థి పేరును అధిష్ఠానం పెండింగ్​లో పెట్టింది. రెండు మూడు రోజుల్లో మరోసారి సర్వే చేసి.. నాయకుల అభిప్రాయాలు తెలుసుకొని.. అభ్యర్థి పేరును వెల్లడించవచ్చని సమాచారం.

Station Ghanpur assembly constituency issue : స్టేషన్​ఘన్​పూర్​లో రాజుకున్న రాజకీయవేడి.. టికెట్​పై ఎవరికి వారు ధీమా..!

మరో ఆలోచనకు తావివ్వకుండా కడియం శ్రీహరికే.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల‌్యే తాటికొండ రాజయ్యను కాదని.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. టికెట్‌ తనకే వస్తుందని ప్రకటించిన రాజయ్య సహా ఆయన అనుచరులు నిస్పృహలో మునిగిపోయారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య ఆది నుంచి విభేదాలు ఉన్నా.. ఇటీవల కాలంలో అవి తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధంసాగగా.. అధిష్ఠానం కలుగజేసుకుని కట్టడి చేసింది. నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే విస్మరించాడనే ఆరోపణలే కాకుండా జానకీపురం సర్పంచి నవ్య వ్యవహారం రాజయ్య ప్రతిష్టను మరింత దిగజార్చింది. వాటన్నింటిని అధిష్ఠానం పరిగణలోకి తీసుకుని.. మరో ఆలోచనకు తావివ్వకుండా కడియం శ్రీహరికే స్టేషన్ ఘన్‌పూర్ టికెట్‌ ఖరారు చేసింది.

"ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించి.. నాకు రాజకీయ జన్మనిచ్చిన మీకు(ముఖ్యమంత్రి కేసీఆర్) నేను రుణపడివుంటాను. కార్యకర్తలు అందరూ కూడా నా వెన్నంటు ఉంటూ.. నాతోపాటు ప్రయాణిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన నా ములుగు జిల్లా ప్రజలకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. అదేవిధంగా మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్​కు నా ధన్యవాదములు." - బడే నాగజ్యోతి, ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి

ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు(Congress MLA Seethakka) ధీటుగా ఉండేందుకు బడే నాగజ్యోతి పేరును కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం ములుగు జిల్లా జడ్పీ చైర్ప​ర్సన్‌గా ఆమె కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించగానే తన నివాసంలో టీవీ చూస్తూ ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. సీఎమ్​కు కృతజ్ఞతలు తెలిపారు.

Warangal Politics 2023 : పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Minister Errabelli Dayakar Rao) పాలకుర్తి అభ్యర్థిగా వరుసగా ఎనిమిదో సారి ఎన్నికలబరిలోకి దిగుతున్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానన్న ఎర్రబెల్లి మరోసారి అవకాశమిస్తే సేవకుడిలా పనిచేసి రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారుచేసిన ముఖ్యమంత్రికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి.. మరో పేరుకు తావివ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్​ను అభ్యర్థిగా ఖరారు చేశారు.

వరంగల్ పశ్చిమ నుంచి వినయ్ భాస్కర్, పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, మహబూబాబాద్ నుంచి శంకర్ నాయక్, డోర్నకల్ నుంచి రెడ్యానాయక్, వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్, నర్సంపేట నుంచి పెద్దిసుదర్శన్ రెడ్డిలకు మరోసారి అవకాశం కల్పించారు. ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ రూపొందించి ప్రచారం చేపట్టేందుకు.. అభ్యర్థులు సన్నద్ధమౌతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.