ETV Bharat / state

బండి సంజయ్​కు ఘనస్వాగతం పలికిన వరంగల్ శ్రేణులు - Warangle bjp rally

వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు వరంగల్ కమలదళం ఘనంగా స్వాగతం పలికింది. నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.

బండి సంజయ్​కు ఘనస్వాగతం పలికిన వరంగల్ శ్రేణులు

author img

By

Published : Jan 5, 2021, 2:04 PM IST

హైదరాబాద్ నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు నగర శివార్లలో కమలదళం ఘన స్వాగతం పలికింది. కడిపికొండ వంతెన వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు... జిల్లా నేతలు, కార్యకర్తలు సంజయ్​కు స్వాగతం పలికారు.

అనంతరం నగరంలోని ముఖ్య కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. కాజీపేట, సుబేదారి, హన్మకొండ చౌరస్తా, ఎంజీఎం కూడలి వరంగల్ మీదుగా హంటర్ రోడ్ విష్ణుప్రియ గార్డెన్స్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ అధ్యక్షురాలు రావు పద్మ, నగర మున్సిపల్ కార్పొరేషన్ ఇంఛార్జి జితేందర్ రెడ్డి, ఏనుగుల రాకేశ్​ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.

విష్ణుప్రియ గార్డెన్స్​లో నిర్వహించే సభలో సంజయ్ పాల్గొంటారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు... భాజపాలో చేరనున్నారు.

ఇదీ చూడండి: ప్రగతిభవన్ ముట్టడికి భాజపా కార్పొరేటర్ల యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.