ETV Bharat / state

షర్మిల బీజేపీ వదిలిన బాణం: వినోద్‌ కుమార్‌

author img

By

Published : Dec 1, 2022, 3:52 PM IST

Vinod Kumar Fires On Sharmila: వైఎస్ షర్మిలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్‌ కుమార్‌ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడంలో అర్ధం లేదని ఆరోపించారు. షర్మిల ఏపీలో పాదయాత్ర చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని వినోద్‌ కుమార్‌ సూచించారు.

Vinod Kumar fires on Sharmila
Vinod Kumar fires on Sharmila

Vinod Kumar Fires On Sharmila: వైఎస్‌ షర్మిల బీజేపీ వదిలిన బాణంమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్‌ కుమార్‌ ఆరోపించారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేయడంలో అర్ధం లేదని విమర్శించారు. ఆమెకు ఇక్కడ అభివృద్ధి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని దుయ్యబట్టారు. షర్మిల ఏపీలో పాదయాత్ర చేస్తే చక్కటి ఫలితం ఉంటుందని సూచించారు. ఈ ప్రాంతంలో ఒక్క నిమిషమైనా కరెంట్‌ పోతోందా .. మీ అన్న పాలించే ప్రాంతంలో అసలు కరెంట్‌ ఉందా అని అన్నారు. షర్మిల వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని వినోద్ కుమార్ హితవు పలికారు. వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"వైఎస్​ఆర్ తెలంగాణ వ్యతిరేకి. మీ పాదయాత్ర కేవలం తెలంగాణ ప్రజలను, సమాజాన్ని మభ్యపెట్టి.. తెలంగాణ ఉద్యమపార్టీ, ఉద్యమ నేత కేసీఆర్​ను కించపరస్తూ ఉపనాస్యాలు ఇస్తున్నారు. కేంద్రంలో భాజపా వదిలిపెట్టినా ఒక కార్యకర్త షర్మిల. అమిత్ షా మాట్లాడిన తర్వాత షర్మిల పాదయాత్రలో మాట్లాడిన వ్యాఖ్యలన్ని వింటున్నాము. శాసనసభ్యులను, వారి కుటుంబాలను కించపరిచే విధంగా షర్మిల మాట్లాడుతున్నారు." - వినోద్‌ కుమార్‌ , రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు

షర్మిల బీజేపీ వదిలిన బాణం: వినోద్‌ కుమార్‌

అసలేెం జరిగిదంటే: మంగళవారం వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. షర్మిలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని.. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అరెస్ట్ చేశారని.. ఆమె తరపు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని, పోలీస్‌ అధికారులపై దురుసుగా ప్రవర్తించారని, అధికారుల వస్తువులను సైతం లాక్కొనే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. పాదయాత్ర విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలని, షర్మిలకు సూచించింది. టీఆర్​ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనను అరెస్ట్ చేయించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని, ప్రజల పక్షాన నిలబడటం తప్పా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి: అవినీతిని ఎత్తిచూపితే వ్యక్తిగతంగా దూషిస్తున్నారు: షర్మిల

ఆంధ్రావాళ్లని మాట్లాడుతున్నారు.. కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా?: షర్మిల

శ్రద్ధ హత్య కేసులో అఫ్తాబ్​ నార్కో టెస్ట్​ 'సక్సెస్'​.. కానీ ఆ సాక్ష్యాలు చెల్లవట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.