ETV Bharat / state

కరోనా వ్యాప్తి దృష్ట్యా అప్రమత్తత అవసరం: ఈటల

వరంగల్ అర్బన్ జిల్లా​ హాసంపర్తి మండలం ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు మంత్రి ఈటల హాజరయ్యారు. భక్తులంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.

jathara
జాతరలో ఈటల
author img

By

Published : Mar 31, 2021, 4:55 PM IST

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా... కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా​ హాసంపర్తి మండలం ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న జాతరకు మంత్రి ఈటల హాజరయ్యారు.

స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు వచ్చే భక్తులు కొవిడ్​ను దృష్టిలో పెట్టుకొని గుంపులుగుంపులుగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రైతుల వల్లే ఆర్థిక వ్యవస్థ కొంతైనా నిలబడగలిగింది: ఉపరాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.