గంజాయి అక్రమరవాణాకి పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 లక్షల రూపాయల విలువ చేసే 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌కి చెందిన అమర్ గోస్వామి, ముఖేష్ గోస్వామి, గుడ్డు, సాగర్‌లుగా పోలీసులు గుర్తించారు.
ఏపీలోని విశాఖపట్నం నుంచి యూపీకి గంజాయి తరలించే క్రమంలో భాగంగా కాజీపేటలోని ఒక లాడ్జీలో భద్రపరిచారు. మరుసటి రోజు యూపీకి వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా..... గుడ్డు, సాగర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు పరారీ అయినట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో వీరు గంజాయి రవాణా చేస్తున్నట్లు కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు.
ఇవీ చూడండి: ప్రేమికులకు సర్ప్రైజ్ ఇచ్చే ఆ ప్రేమికుడెవరో...?