వరంగల్ అర్బన్ జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెను 12వ రోజు ఉద్ధృతం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ హన్మకొండ చౌరస్తా నుంచి ఏకశిలా పార్క్ వరకు ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శనను చేపట్టారు. 12 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండిః "సర్కారు స్పందిచలేదు.. సమ్మెపై వెనక్కి తగ్గేదిలేదు"