ETV Bharat / state

బడ్జెట్​లో ఊసేలేని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ - railway budget

రైల్వే బడ్జెట్‌లో కాజీపేటకు ప్రత్యేక శ్రద్ధ చూపారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పిరియాడికల్‌ ఓవరాలింగ్‌ పరిశ్రమ(పీవోహెచ్‌)పై కాజీపేటను డివిజన్‌ కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనను ఉండేట్లు చర్యలు తీసుకున్నారు. కాజీపేటకు కొత్తగా ఏమి రాకపోయినా పాత ప్రతిపాదనలు బతికించే ప్రయత్నం చేశారు.

సజీవంగా కాజీపేట డివిజన్‌ కేంద్రం
author img

By

Published : Jul 6, 2019, 10:05 AM IST

కేంద్ర రైల్వే బడ్జెట్‌లో కాజీపేట పీవోహెచ్‌ నిర్మాణానికి ఈసారి రూ.10 కోట్ల బడ్జెట్‌ను పెంచారు. 2017-18వ సంవత్సరంలో పీవోహెచ్‌కు రూ.188 కోట్లు కేటాయించారు. తర్వాత 2018-19 బడ్జెట్‌లో దీనికి మరో పదికోట్లు పెంచి రూ.198 కోట్ల అంచనా చేశారు. ఈసారి దీనికి అదనంగా మరో పది కోట్లు కలిపి అంచనా రూ.208 కోట్లకు పెంచారు. ఇలా చేయడంతో ప్రాజెక్టు పనులు సజీవంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని దేవాదాయ శాఖ నుంచి సేకరించి కేంద్రానికి అప్పగించాల్సి ఉంది. కానీ ఈ విషయంలో ఆలస్యం జరగడంతో పనులు ప్రారంభం కావడం లేదు. ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ చూపితే ఈ సంవత్సరం పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.

శిక్షణ కేంద్రాలకు కేటాయింపులు
కాజీపేటలో ఉన్న లోకో, ఇంజినీరింగ్‌ శిక్షణ కేంద్రాల అభివృద్ధికి రైల్వే బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారు. కాజీపేటను రైల్వే డివిజన్‌ కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో శిక్షణ కేంద్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది. డివిజన్‌ కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలను అభివృద్ధి చేయడానికి రైల్వే ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కాజీపేటలో ఉన్న వీటికి ఎక్కువ మొత్తంలో డబ్బులు కేటాయించడం చూస్తే కేంద్రం కాజీపేటను డివిజన్‌ కేంద్రంగా చూడాలని భావిస్తుందని రైల్వే నిపుణులు చెబుతున్నారు.

మూడో లైన్‌కు
హసన్‌పర్తి వరంగల్‌, విజయవాడ మార్గంలో నిర్మిస్తున్న మూడో లైన్‌ కోసం రూ.20 కోట్లు అదనంగా కేటాయించారు. బల్లార్షా- విజయవాడ మార్గంలో నిర్మితమవుతున్న మూడోలైన్‌కు గతేడాది రూ.219 కోట్లు కేటాయించారు. వీటితో పనులు జరుగుతున్నాయి. దీనికి అదనంగా కేటాయింపులు జరిగాయి. మూడోలైన్‌ నిర్మాణం పూర్తవుతూ బల్లార్షా-విజయవాడ మార్గంలో రైళ్ల ఆలస్యాన్ని పూర్తిగా తగ్గించడానికి వీలవుతుంది.

కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేదు
ఎప్పటిలాగే ఈసారి కూడా రైల్వే బడ్జెట్‌లో మొండి చేయి చూపింది. గత చాలా ఏళ్లుగా బడ్జెట్‌లో కాజీపేటకు కోచ్‌ ప్యాక్టరీని ప్రకటిస్తారనే ఆశతో ప్రజలు వేచి చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కేంద్రానికి సంబంధించిన భారీ పరిశ్రమలు రావాలంటే రైల్వే నుంచే రావలసి ఉంటుంది.

ఇదీ సంగతి : ఇవాళే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.