వరంగల్ పార్లమెంట్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్. 16 లోక్‌సభ సీట్లు గెలిచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తామని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో భాజపా, కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించడం కోసం తెరాస కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కరీమాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, గుండు సుధారాణి, ఇతర కార్యకర్తలు హాజరయ్యారు.
ఇవీ చూడండి:'ఐపీఎస్ సాధించి పేదవారికి సాయం చేస్తా'