తెలంగాణ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రంలో అధికారంలోనున్న భాజపా అమలు చేయడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని విమర్శించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం వైఖరి నిరసిస్తూ.. రైల్వే స్టేషన్ ఎదుట తెరాస నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, చట్టబద్ధమైన హక్కు అన్నారు.
దేశంలోని వివిధ పార్టీల సహకారంతో రాబోయే కాలంలో కేంద్రంలో.. కేసీఆర్ నాయకత్వంలోని తెరాస అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ జిల్లా ప్రజల 3 దశాబ్దాల కల అన్నారు. దాన్ని సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తమతో కలిసొచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో ఉద్యమిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పే వరకు పోరాటం ఆపేదిలేదు'