వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో తెరాస నాయకులు పింగిలి ప్రదీప్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు.
మొన్న జరిగిన హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్థల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.
మాజీ ఎంపీపీ వొడితల సరోజిని దేవిపై అవిశ్వాస తీర్మాణం పెట్టించి ఇబ్బందలకు గురి చేశారని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలోనే హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఇదీ చదవండి: ఆపదలో ఆత్మీయత.. ఈ స్టార్టప్‌ల ప్రత్యేకతయత.. ఈ స్టార్టప్‌ల ప్రత్యేకత