పల్లా రాజేశ్వర్‌రెడ్డికి.. తెరాస అధినేత, సీఎం కేసీఆర్.. బీ ఫాం అందజేశారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లాను బరిలో నిలుపుతున్నట్లు తెరాస అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పల్లా.. రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీలో ఎంతో కాలంగా క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి తెరాస తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటికే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంతో పాటు నల్గొండ- వరంగల్- ఖమ్మం స్థానానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
ఇవీచూడండి: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థిగా పల్లా