వరంగల్ బల్దియా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే తమ తమ డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
కాజీపేట్ మండలం కడిపికొండ 44వ డివిజన్ తెరాస అభ్యర్థి కంకణాల శ్రీదేవి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. డప్పు చప్పుళ్లతో వీధివీధి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: మానేరు వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు