కొవిడ్ వ్యాక్సిన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్ భాజపా, తెరాస శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. బ్యానర్లో ప్రధాని మోదీ పొటో లేదంటూ భాజాపా శ్రేణులు వరంగల్ పట్టణంలో పలు చోట్ల ఆందోళనలకు దిగారు.
ఎంజీఎం ఆసుపత్రి వద్ద కట్టిన పలు బ్యానర్లు చించివేశారు. దేశాయ్పేట ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చిన భాజపా కార్యకర్తలను తెరాస నాయకులు అడ్డుకోగా.. పరస్పరం తోపులాటలు జరిగాయి. కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
రానున్న ఎన్నికల నేపథ్యంలోనే భాజపా నాయకులు ఇలా అనవసరంగా గొడవలు సృష్టిస్తున్నారని తెరాస నాయకులు ఆరోపించారు. గతంలోనూ భాజపా నాయకుల పొటోలు లేవంటూ గొడవలు చేశారని.. ఇందంతా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనంటూ విమర్శించారు.
ఇదీ చూడండి: కొవిడ్ జ్ఞాపకాలు తలచుకొని మోదీ కన్నీటిపర్యంతం