భాజపా సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మృతి పట్ల వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. హన్మకొండలోని భాజపా పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు రావు పద్మ, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 'తెలంగాణ చిన్నమ్మ'గా పేరొందిన సుష్మాస్వరాజ్ మృతి చెందడం దేశానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ వెలుపల,లోపల తమ గళాన్ని వినిపించారని చెప్పారు.
ఇవీ చూడండి: 'లోక్సభ సమావేశాల ఆల్టైమ్ రికార్డ్'