నెల రోజుల సెలవుల తర్వాత వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా మొదలయ్యాయి. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు మార్కెట్కు సెలవులు ప్రకటించారు. బుధవారం మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలను తిరిగి ప్రారంభించారు.
కొవిడ్ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న వేళ రైతులు మాస్కులు ధరించి లోనికి వస్తున్నారు. మాస్కులు లేకుండా వచ్చిన వారిని మార్కెట్లోకి అనుమతించట్లేదు. ప్రతి రైతు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టినప్పటికీ అవి అమలు అవ్వట్లేదంటూ కొందరు ఆరోపిస్తున్నారు. మార్కెట్ ప్రధాన గేటు వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసే సిబ్బంది కనిపించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.
ఇదీ చదవండి: 'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'