పార్టీ, కుటుంబ కలహాలతో ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ మధ్య కాలంలో పూర్తిగా అసహనానికి గురవుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో పర్యటించారు. ప్రజల భిక్షతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్... ముఖ్యమంత్రి పదవిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు.
హాలియా సభలో కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని... అమ్ముడుపోయారనడం ఏంటని ప్రశ్నించారు. సమస్యలు విన్నవించుకునేందుకు సభకు వెళ్లినవారిని కుక్కలతో పోల్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ కార్యకర్తలకు, ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: కేసీఆర్ కుటుంబ అప్రజాస్వామిక పాలనను ఎండగట్టాలి: మాణిక్కం