వరంగల్ పట్టణ జిల్లా ఖాజీపేట మండలం మడికొండలో ఐటీ మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. మడికొండ శివారులోని సైయంట్, టెక్ మహీంద్రా కంపెనీలను ప్రారంభించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరిశీలించారు.
ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న వరంగల్... ఐటీ హబ్‌గా, టూరిస్టు హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రెండు కంపెనీల ప్రారంభం తర్వాత సుమారు వేయి మందికి అవకాశాలు వస్తాయని తెలిపారు.
ఇదీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'