కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజులు మూతపడి ఉన్న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ వేయి స్తంభాల ఆలయాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ రోజు తెరిచారు. చాలా రోజుల తర్వాత గుడి తెరవడం వల్ల వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి థర్మల్ స్క్రీనింగ్ చేశాకే లోపలికి పంపిస్తున్నారు. శానిటైజర్లను కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు. ఒక్కొక్కరికి మధ్య ఆరడుగుల దూరం ఉండేలా వృత్తాలు గీశారు. అంతరాయ ప్రవేశం, శఠగోపం,తీర్థ వినియోగం ఆపివేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలను ఆలయానికి అనుమతించడం లేదు. కరోనా వైరస్ సందర్భంగా భక్తులు అందరూ విధిగా నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయ అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష