తొలిఏకాదశి పండుగ సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాగణపతి పూజ అనంతరం... ఉప్పుగల్ గ్రామంలోని ఆకేరు వాగు నుంచి నీరు తీసుకొచ్చి స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.
దేవస్థాన ఆవరణలోని శ్రీ భ్రమరాంబిక దేవి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీ రూపంలో అలంకరించారు. కరోనా దృష్ట్యా థర్మల్ స్క్రీనింగ్ అనంతరం భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించారు. సామాజికదూరం, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు.