ఒక మంచి పని చేస్తే నలుగురికి మేలు చేస్తుందని... ఒక మొక్క నాటితే అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి... తెలంగాణను పచ్చదనంగా మార్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'సింగిల్ కార్పొరేషన్తోనే పోటీని ఎదుర్కోగలం'