వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని భాజపా కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపే వరకు పోరాటం ఆగదని చెప్పారు. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'విమోచనాన్ని అధికారికంగా నిర్వహించే వరకు పోరాటం ఆగదు'