ETV Bharat / state

'ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తా'

ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్​లో టీఎన్జీవోస్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం, కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు.

telangana government chief whip vinay bhaskar
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
author img

By

Published : Oct 10, 2020, 11:20 AM IST

ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని ప్రభుత్వ చీఫ్​విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాష్ట్ర సాధనలో టీఎన్జీవోస్ నాయకులు ముఖ్య భూమిక పోషించారని.. తప్ప కుండా ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని భరోసానిచ్చారు. త్వరలోనే కారం రవీందర్ రెడ్డికి మంచి పదవి లభిస్తుందని తెలిపారు.

హన్మకొండలోని అంబేడ్కర్​ భవన్​లో.. కారం రవీందర్ రెడ్డిని, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​ను అతిథులు ఘనంగా సన్మానించారు. తొలుత కౌన్సిల్ సమావేశంలో 15 ప్రతిపాదనలు చేసి టీఎన్జీవోస్ నాయకులు వాటిని వినయభాస్కర్​కు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ చీఫ్​విప్ దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్న వినయ్ భాస్కర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.