లాక్డౌన్ సమయంలో అన్నార్తులకు అండగా నిలవాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. హన్మకొండలోని అమ్మ వృద్ధాశ్రమంలో ఆయన అన్నదానం చేశారు. కరోనా వైరస్ క్రమంగా కారణంగా ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు.
పని లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు దాతలు ముందుకొచ్చి ఉదారతను చాటుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు.
ఇదీ చూడండి : 'వలస కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'